తెలుగు హైందవులు అన్యమతస్తులకు వదులుకుంటున్న పదాలను వెనక్కి తీసుకోవాలి.
- Srinivasa Malladi
- Mar 15, 2022
- 1 min read
హిందువులము తెలుగు భాషకు సొంతమైన ఎన్నో కీలక పదాలను అన్యమతస్తులకు వదిలిపెట్టి నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ పదాలను మరల మనం హైందవ సంప్రదాయంలోకి తీసుకువచ్చే ప్రయత్నం అందరు చిత్తశుద్ధితో చెయ్యాలి. ఇక్కడ చిత్రం ద్వారా ఒక ఉదాహరణ చూపిస్తున్నాను. సాహిత్యంలో ఈ పదాలను, భావాలను కథల ద్వారా గాని, banners ద్వారా గాని తయారు చేసి పదే పదే సమాజంలో వాడాలి.
అన్య మత ప్రచారం అవుతున్నది తెలుగు , తమిళం, పంజాబీ వంటి ప్రాతీయ భాషలలో. ఇంగ్లీషులో కాదు.
హిందువులు తెలుగుని వదిలి పెట్టి ఎక్కువగా ఇంగ్లీషులో వ్యవహరిస్తున్నారు.
దయ , కరుణ, ప్రార్థన, ఆశీర్వాదము, స్వస్థత, కూటమి, ప్రభు వంటి పదాలు సనాతన ధర్మానికి కూడా ప్రతీక. అలాగే అవి మానవతా విలువువలతో కూడినవి. సనాతన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మానవతా దృక్పధంతో మనం వ్యవహరిస్తాము. అలాగే భాషలో , సంభాషణలో, దైవ ప్రచారంలో కూడా ఆ పదాలు, ఆ ప్రస్తావన చేస్తాము.
పరమాత్ముని దైవ సందేశమైన సనాతన ధర్మ ఆచారం ప్రచారం ప్రతి మానవుని కర్తవ్యమ్. అన్యమతస్తులు ఆచరిస్తున్నారు , ప్రచారం చేస్తున్నారు. హిందువులు విస్మరిస్తున్నారు. హిందువులకు దైవ సందేశ ప్రకటనలో concession ఇవ్వబడలేదు. మహర్షి నారదుడు సమదృష్టితో అందరివద్దకు వెళ్లి దైవ సందేశమైన ఆత్మవిద్యను అనగా సనాతన ధర్మాన్ని ప్రకటించారు
పరమాత్మ తత్వాన్ని సనాతన ధర్మాన్ని నలుమూలలా ప్రకటించు బాధ్యత ప్రతి హిందువుదీ. సనాతన ధర్మమే అసలైన విద్య . మోక్షమార్గాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య. సమాజంలో ఆనందంగా జీవిస్తూ నిత్యం ఆ నారాయణుని శరణాగతిలో ఉండడమే అసలైన విద్య.

Comments