తల్లిదండ్రుల ఇహపర శ్రేయస్సుకు కారణమయ్యేవాడే నిజమైన పుత్రుడు
- Srinivasa Malladi
- Jun 27
- 1 min read
పుత్రః
పు-నామ్నో నరకాత్ త్రాయతే ఇతి పుత్రః।
*అర్థం:*
*"పు"* అనే నరకం నుండి *తల్లిదండ్రులను రక్షించేవాడే "పుత్రుడు".*
అంటే, *తల్లిదండ్రుల పరలోక శ్రేయస్సుకు కారణమై, వారిని అధోగతి నుండి ఉద్ధరించేవాడే నిజమైన పుత్రుడు.*
*ముఖ్య సందేశం:*

*పుత్రుడు* అంటే కేవలం జన్మించిన కుమారుడు కాదు;
తల్లిదండ్రుల ఇహపర శ్రేయస్సుకు కారణమయ్యేవాడే నిజమైన పుత్రుడు.
అటువంటి పుత్రుడు _ *పృథు మహారాజు*మనకు ఆదర్శం- భాగవతం శ్లోకం చూద్దాం రండి.👇🏽
యద్వేనముత్పథగతం ద్విజవాక్యవజ్ర- నిష్ప్లుష్టపౌరుషభగం నిరయే పతంతమ్ ।
త్రాత్వార్థితో జగతి పుత్రపదం చ లేభే దుగ్ధా వసూని వసుధా సకలాని యేన ॥
— శ్రీమద్భాగవతం 2.7.9
భావం:
ధర్మమార్గం నుండి తప్పిపోయి నరకగతికి చేరిన వేనుని తన పుణ్యశక్తితో ఉద్ధరించిన పృథు మహారాజు, నిజమైన *పుత్రుడు* అనే పదానికి అర్థాన్ని చూపించాడు. తల్లిదండ్రులను జీవితంలో సేవించడమే కాదు, వారి పరలోక శ్రేయస్సుకు కూడా కారణమయ్యే వాడే *పుత్రుడు* అని ఈ శ్లోకం బోధిస్తుంది.




Comments