ధ్రువుని వాక్కు మేల్కొలిపిన నారాయణుడు: శ్రీమద్ భాగవత రసామృతం
- Srinivasa Malladi
- 1 day ago
- 1 min read
రచన: హిందూమిత్ర Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి

శ్లోకం
యోऽంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాంసంజీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా ।అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం ॥
అర్థం
ఓ భగవంతుడా!నాలోనికి ప్రవేశించి, నిద్రించిన నా వాక్కును మేల్కొలిపే,అఖిలశక్తులతో నిండిన, స్వప్రకాశమయుడవైన నీవు,నా చేతులు, కాళ్లు, చెవులు, చర్మం మొదలైన అన్ని ఇంద్రియాలకు,ప్రాణశక్తిని నింపుచున్నావు.ఓ పరమ పురుషా! నిన్ను వినమ్రంగా నమస్కరిస్తున్నాను.
భావం
పిల్లలూ!ఇది ధ్రువుడు అన్న శ్లోకం.చిన్నారి ధ్రువుడు అరణ్యంలో తపస్సు చేస్తూ నారాయణుడిని భక్తితో పిలిచాడు.తర్వాత నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు.ఆ దివ్యసన్నిధిలో ధ్రువుడు భక్తితో తడబడిపోయాడు —“నారాయణా! నేను చిన్న పిల్లవాణ్ణి కదా, నిన్ను వర్ణించే మాటలు నాకు రావు!” అని అన్నాడు.
అప్పుడు నారాయణుడు ప్రేమతో చిరునవ్వు చిందించి,ధ్రువుడి చెంపను తన దివ్యహస్తముతో తాకాడు.అంతే — ధ్రువుడి వాక్కు దివ్యమైపోయింది.నోటినుండి ఎన్ని కబుర్లు వచ్చాయంటే నారాయణుని మహిమను అద్భుతంగా వర్ణించాడు.
ఆ సమయంలో ధ్రువుడు అన్న మాటలే ఇవి —“తండ్రి! నీవు నాలోకి ప్రవేశించి,నిద్రలో ఉన్న నా వాక్కును మేల్కొలిపి,నా శరీరమంతా దివ్య కాంతితో నింపి,నా చేత ఇంత బాగా మాట్లాడిస్తున్నావు!” అని.
సూచన 🌸
పిల్లలూ! మీరు స్టేజీపై చాలా మంది ముందర మాట్లాడాలనుకున్నా,లేదా పాట పాడాలనుకున్నా —ఈ శ్లోకాన్ని స్మరించి స్టేజి ఎక్కితే చక్కగా మాట్లాడవచ్చును పాడవచ్చును కూడాను. మనలో భగవంతుడు ఉన్నాడని విశ్వాసంతో చెప్పండి.అప్పుడు మాటలు అవే వస్తాయి, పాట అదే పుడుతుంది!
ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ అభ్యసించి గుర్తుపెట్టుకోండి. సరేనా. దీనివల్ల మన వాక్కుకు దివ్యమైన శక్తి వస్తుంది.
పరిశుద్ధ నామస్మరణం
🕉️ ఓం నమో నారాయణాయ🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ




Comments