పిల్లలకు ధ్యాన మార్గదర్శకం
- Srinivasa Malladi
- Nov 29, 2025
- 1 min read

బంగారం, కూర్చోడానికి ఒక సౌకర్యమైన చోటు చూసుకో.
నీ వీపు నిటారుగా ఉంచి, చేతులను మోకాలపై ఉంచు.
ఇప్పుడు… మెల్లగా కళ్లను మూసుకో.
ఒకసారి లోతుగా ఊపిరి తీసుకో…
మరలా మెల్లగా ఊపిరిని వదిలిపెట్టు…
మనమే మనకు స్నేహితులం అవ్వగలమనే ఒక అందమైన శ్లోకం నాతో పాటూ చెప్పు:
ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం న ఆత్మానం అవసదయేత్
ఆత్మైవహి ఆత్మనః బంధుః ఆత్మైవ రిపు: ఆత్మనః
**నా మనసు చల్లగా, మంచిగా ఉంటే అది నా మిత్రం.
నాలో కోపం అసూయ భయం వంటివి వదిలిపెట్టి నేను నాకు మిత్రుడనవుతాను.**
ఇప్పుడు నీలోని ఆ మంచి స్నేహితునిని కలుసుకుందాం.
ఒక వెలుగు నీ హృదయంలో మెల్లగా వెలుగున్నదని ఊహించు…
ఆ వెలుగు నీ మనసును ప్రశాంతతతో నింపుతోంది…
సహనంతో నింపుతోంది… ప్రేమతో నింపుతోంది…
మెల్లగా నీలో చెప్పుకో:
**“నేనే నా మిత్రం…
నేను నా మనసును నిర్మలంగా ఉంచుతాను…”**
ఒకసారి మళ్లీ లోతుగా ఊపిరి తీసుకో…
మెల్లగా విడిచిపెట్టు…
ఇప్పుడు నువ్వు సిద్ధమైనప్పుడు నెమ్మదిగా కళ్లను తెరువు.
శభాష్!
నువ్వు నీ అంతరంగంలోని స్నేహితునితో మాట్లాడి వచ్చావు.
ఓం శాంతి శాంతి శాంతిః




Comments